Ram Gopal Varma: ఇలాంటి కేసులకు నేను భయపడా.. AP పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV రియాక్షన్

ఆర్జీవీ (Ram Gopal Varma) రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టడంతో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్  చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండ్రోజుల నుంచి అతని కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? భయపడి ఎక్కడైనా దాక్కున్నాడా? అని నెటిజన్ల నుంచి వినిపిస్తూనే ఉంది. 

ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ ఓ వీడియో రిలీజ్ చేసి నేను ఎక్కడ దాక్కోలేదని స్పష్టం చేశారు. ‘నేను కేసులకు, పోలీసులకి భయపడి వణికిపోతున్నాను.. మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరు మాట్లాడుకుంటున్నారు. అలాంటి వారికి ఈ వీడియో డిస్సప్పాయింట్ కలిగించవచ్చు అన్నారు. 

Also Read:-47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?

అలాగే 'ఏదో ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. అసలు ఏడాది క్రితం పెట్టిన ట్వీట్స్ కు.. నాలుగు వేరు వేరు చోట్ల నలుగురు వేరే వ్యక్తులకి.. మూడు రోజుల వ్యవధిలో ఎలా వారి మనోభావాలు దెబ్బతింటాయి ? అలా నేను చేసిన ట్వీట్స్ కి సంబంధం లేని వ్యక్తులకి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని తనదైన శైలిలో ప్రశ్నించారు?

ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసు­కుని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరఫ్, ఇక్కడా అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నాను. మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నా’ అని రిలీజ్ చేసిన వీడియోలో వెల్లడించారు. కాగా ఆర్జీవి దాఖలు చేసిన పిటిషన్లపై 2024, నవంబర్ 26న విచారణ చేపట్టిన హైకోర్టు.. బుధవారానికి (నవంబర్ 27) వాయిదా వేసింది.