హైదరాబాద్, వెలుగు:
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసుల్లో ఆయకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఆయనపై ఉన్న మూడు కేసులలో బెయిల్ లభించడం భారీ ఊరట అనే చెప్పవచ్చు. గతంలో ఏపీ ప్రముఖ నాయకుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియాలకు సంబంధించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ALSO READ : Nagababu: ఏపీ కేబినెట్లోకి నాగబాబు.. ఏ శాఖ ఇవ్వనున్నారంటే.?
గతంలో ఏపీ ప్రముఖ టీడీపీ నాయకుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియాలకు సంబంధించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వర్మపై కేసు నమోదవగా ఆయన కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ తాను షూటింగ్ పనిలో బిజీగా ఉన్నానని.. ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. ఈ కేసుల విషయంలో వర్మ బెయిల్ పిటిషన్ వేయగా, ఇవాళ (మంగళవారం) విచారించిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేసింది.
ఆర్జీవీపై నమోదైన కేసుల నేపథ్యమేంటి?
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదల సందర్భంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 2009లో అనూహ్య మరణం, ఆ తర్వాత జగన్ వైసీపీ పార్టీ ఆవిర్భావం, ఆ తదనంతర పరిణామాలపై ‘వ్యూహం’ సినిమా తెరెక్కించారు. సినిమా విదడులకు అడ్డంకులు వస్తున్నాయన్న కారణంతో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు ఇతర టీడీపీ నాయకులకు సంబంధించి అవమానకరమైన పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. తమ నాయకుల పరువకు భంగం కలిగేలా పోస్టులు షేర్ చేశారని రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ మండల సెక్రెటరీ రామలింగం ప్రకాశం జిల్లాలో ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై ఐటీ యాక్ట్ తో పాటు పరువు నష్టం కేసులు నమోదయ్యాయి.