న్యూఢిల్లీ: 2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ నెల పదో తేదీ వరకు రూ. 14.71 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోయిన ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 24.58 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, నెట్ ఆఫ్ రీఫండ్స్ విలువ రూ. 12.31 లక్షల కోట్లుగా రికార్డయింది. ఇది పోయిన సంవత్సరం ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 19.55 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో ఇది 86.68 శాతం.
