నోబెల్ విజేతకు ఇచ్చే డిన్నర్ క్యాన్సిల్

నోబెల్ విజేతకు ఇచ్చే డిన్నర్ క్యాన్సిల్

కరోనా ఎఫెక్ట్ తో కమిటీ నిర్ణయం

స్టాక్ హోం: నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కు ఈ ఏడాది డిసెంబర్ లో ఇచ్చే డిన్నర్ ను క్యాన్సిల్ చేశారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. కరోనా నిబంధనలు ఉండగా 1300 మందితో డిన్నర్ ఏర్పాటు చేయటం సాధ్యం కాదని నోబెల్ ఫౌండేషన్ సీఈఓ హైకెన్ స్టెన్ అన్నారు . ప్రైజ్ విన్నర్స్ ను ఓస్లోలో ప్రకటిం చి వారికి స్వీడన్ లో అవార్డు అందజేస్తారు. ఐతే స్వీడన్ లో అవార్డు ప్రదానం కార్యక్రమం కూడా అనుమానమేనని చెప్పారు . ప్రస్తుత పరిస్థి తుల్లో గతంలో లాగా నోబెల్ ప్రైజ్ కార్యక్రమం జరగదని ఆయన అన్నారు. ఐతే 1956 తర్వాత నోబెల్ డిన్నర్ ను క్యాన్సల్ చేయటం ఇదే తొలిసారి . నోబెల ప్రైజ్ లను మాత్రం ఎప్పటిలాగే అక్టోబర్ 5 నుంచి 12 వ తేదీలోగా ప్రకటించనున్నారు.