SA20: రేపే సౌతాఫ్రికా టీ20 లీగ్.. ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న దినేష్ కార్తీక్

టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మూడో సీజన్ కోసం పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. మరో రెండు రోజుల్లో జనవరి 10 న టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో కార్తీక్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతూ కనిపించాడు. ఈ  వికెట్ కీపర్ బ్యాటర్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఆడే తొలి భారత ప్లేయర్ గా దినేష్ కార్తీక్ నిలవడనుండడంతో అందరి దృష్టి ఈ వెటరన్ ప్లేయర్ పైనే ఉంది. 

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో తలపడుతుంది. జనవరి 9 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 8 న ముగుస్తుంది. ఫైనల్ కు జోహన్నెస్‌బర్గ్‌ ఆతిధ్యమిస్తుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. సెయింట్ జార్జ్ పార్క్‌లో క్వాలిఫైయర్ 1.. సెంచూరియన్‌లో ఎలిమినేటర్‌,క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి. 

ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు  రిటైర్మెంట్ ప్రకటించారు. మే22 బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూ బిజీగా మారిపోయాడు.  

దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్‌ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్. 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.