పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేసిన డీఐజీ

కోడేరు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం లోని పోలీస్ స్టేషన్ ను గురువారం డీఐజీ ఎల్​హెచ్​ చౌహన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో స్నేహంగా మాట్లాడాలని చెప్పారు. విధి నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ మహేశ్​, ఎస్​ఐ సతీశ్​, రైటర్ పాల్గొన్నారు.