మా నాన్న చనిపోయినప్పడు CWC భేటీ కాలే: శర్మిష్ఠ ముఖర్జీ

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​స్మారకంపై కాంగ్రెస్, బీజేపీ వాగ్వాదం  నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ కూతురు శర్మిష్ఠ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ట్విట్టర్‎లో కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదంటూ పార్టీలోని  ఓ సీనియర్ నేత తనను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అయితే.. తన తండ్రి డైరీ చదివితే అది నిజం కాదని తెలిసిందని చెప్పారు. మాజీ రాష్ట్రపతి కేఆర్​నారాయణన్‎కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించినట్టు తన తండ్రి డైరీలో రాసుకున్నారని చెప్పారు. కాగా, మన్మోహన్​సింగ్​ప్రత్యేక స్మారక స్థలానికి అర్హులని పేర్కొన్నారు.