GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) ట్రైలర్ యూట్యూబ్లో దూసుకెళ్తోంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

అందుకు తగ్గట్టుగానే సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఎంత గ్రాండ్ అంటే.. కేవలం సాంగ్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టేశారంట శంకర్. ఇది కదా శంకర్ విజన్. మరి ఈ సినిమా కోసం శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అలాగే రామ్ చరణ్ ఎంతవరకు తీసుకున్నాడు? అనే వివరాలు చూద్దాం. 

ప్రముఖ నివేదికల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ మూవీకి చరణ్ రూ.45కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా సక్సెస్తో చరణ్ తన రెమ్యునరేషన్ని రూ.100 కోట్లకి పెంచినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ ఫిగర్ నిజమే అయినప్పటికీ.. గేమ్ ఛేంజర్ కోసం చాలా తగ్గించి తీసుకున్నాడట. తనకున్న స్థాయికి వంద కోట్లు ఇచ్చి చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నప్పటికీ.. 'గేమ్ ఛేంజర్' కోసం రూ.65 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ALSO READ | Today OTT Movies: ఇవాళ(జనవరి3న) ఒక్కరోజే OTTలోకి 14 సినిమాలు.. 6 చాలా స్పెషల్

అలాగే శంకర్ సైతం తన రెమ్యునరేషన్లో కొంత మేరకు తగ్గించినట్లు తెలుస్తోంది. అందుకు శంకర్ రూ.35 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అయితే, ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడం.. తరుచూ షూటింగ్ ఆలస్యమవ్వడం వంటి కారణాల చేత.. వీరిద్దరూ తమ పారితోషకాలను తగ్గించుకున్నట్లు వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాత మంచి కొరకు అలోచించి వీరు తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది. 

ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు తన కెరీర్లో పెద్ద సాహసం చేస్తున్నాడు. తన పరిధిని దాటి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో  గేమ్ ఛేంజర్ సినిమాని నిర్మించాడు. ఈ మూవీ పొలిటికల్ సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతుంది. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.

రాజకీయ వ్యవస్థ నుండి అవినీతిని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్న ఒక IAS అధికారిగా(కొడుకు).. ప్రజల బాగు కోసం పోరాడే  అప్పన్న(తండ్రి) గా నటిస్తున్నాడు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.