టార్గెట్ ప్రభాస్ ఎందుకు.. : వరద సాయం ప్రకటించకుండానే తప్పుడు రాతలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరదలపై.. సోషల్ మీడియాలో టార్గెట్ సినీ ఇండస్ట్రీ నడుస్తుంది. వరద సాయం ప్రకటించాలనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే చాలా మంది హీరోలు.. తమ వంతు సాయం ప్రకటించారు.

సినీ హీరోల్లో చాలా మంది ఇంకా ప్రకటించాల్సి ఉంది. వీరిలో హీరో ప్రభాస్ (Prabhas) ఒకరు.. ప్రభాస్ ఇంకా వరద సాయం ఎందుకు ప్రకటించలేదు అంటూ టార్గెట్ చేశారు కొంత మంది నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

హీరో ప్రభాస్ వరద సాయం ప్రకటించారు.. ఐదు కోట్ల రూపాయలు..రూ.3 కోట్ల రూపాయలు అంటూ వార్తలు వండి వారుస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హీరో ప్రభాస్ భారీ విరాళం అంటూ ఎక్స్, ఫేస్ బుక్ లతోపాటు ఏకంగా వెబ్ సైట్ స్టోరీలను కుకింగ్ చేసేశారు కొందరు. 

Also Read :- తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం

ఈ విషయంపై వీ6 న్యూస్ ప్రతినిధులు హీరో ప్రభాస్ మేనేజర్లను సంప్రదించగా.. అలా ప్రకటిస్తే ఆయనే స్వయంగా వెల్లడిస్తారు.. మీడియాకు చెబుతారు.. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడిస్తారు అంటూ హీరో ప్రభాస్ మేనేజర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వరద సాయం ప్రకటించలేదని.. సోషల్ మీడియాలోని వార్తలు అన్ని తప్పు అని వీ6 న్యూస్ ప్రతినిధి దగ్గర వివరించారు. 

ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోని వరదలపై ఓ పార్టీ.. ఓ వర్గం టార్గెట్ గా సినీ హీరోలను ప్రశ్నించటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.