రజనీకాంత్ నిర్ణయం పై స్పందించిన డైలాగ్ కింగ్

రజనీకాంత్ నిర్ణయం పై స్పందించిన డైలాగ్ కింగ్
రాజకీయం అంతా ఒక రొచ్చు.. బురదకుంట  నీలాంటి వ్యక్తికి.. నా లాంటి వ్యక్తికి రాజకీయాలు సరిపడవు రాజకీయాల్లోకి రానంత వరకు మంచోడివి అన్న నోళ్లే చెడ్డోడు అంటాయి రజనీకాంత్ చీమకు కూడా హాని చేయని వ్యక్తి బురద అంటకుండా రజనీకాంత్ రాకపోవడమే మంచిదైంది -మోహన్ బాబు హైదరాబాద్: తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశాన్ని విరమించుకుంటున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటనపై ఆయన ప్రియమిత్రుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.  అభిమానులను రజనీకాంత్ తీవ్రంగా నిరాశపరచినా… అభిమానులు అర్థం చేసుకోవాలని రజనీ అభిమానులకు సూచించారు. రజనీకాంత్ వయసు… ఆరోగ్యంతోపాటు.. చీమకు కూడా హాని తలపెట్టలేని మనస్తత్వం ఉన్న రజనీకాంత్ సరైన నిర్ణయమే తీసుకున్నారని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. రజనీకాంత్-మోహన్ బాబు గాఢమైన స్నేహ బంధం సినీ అభిమానులందరికీ తెలిసిందే. రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మోహన్ బాబు ప్రకటన విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం అభిమానులకు బాధ కలిగించేదే అయినప్పటికీ ఆయన సన్నిహితుడిగా.. స్నేహితుడిగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి.. అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తిగా తాను రజనీకాంత్ మంచి నిర్ణయమే తీసుకున్నారని భావిస్తున్నా. నువ్వు చాలా మంచి వాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది  గ్రేటెస్ట్ పర్సన్. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంతవరకు మంచివాడివి అన్న నోళ్లే రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురదకుంట. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది.  రజనీకాంత్ అభిమానులంతా రజనీకాంత్ అంత మంచోళ్లు. మీరందరూ నా మిత్రుడి నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.’’ అని మోహన్ బాబు ప్రకటనలో పేర్కొన్నారు. మోహన్ బాబు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…