పులికల్ రోడ్డు పూర్తి చేయాలని ధర్నా

అయిజ, వెలుగు: అయిజ నుంచి పులికల్  వరకు 17 కిలోమీటర్ల కొత్త రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని తుపత్రాల, మేడికొండ, పులికల్  తదితర గ్రామాల ప్రజలు బుధవారం తుపత్రాల సమీపంలో రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేండ్ల కింద రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ, ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు.

రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో గుంతలు పడి ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగలదిన్నె బ్రిడ్జి మీదుగా మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, బెంగుళూరు తదితర పట్టణాలకు రాకపోకలు సాగుతుండడంతో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. బీటీ వేయకపోవడంతో ఇరువైపులా ఉన్న పంట పొలాలు దుమ్ముధూళితో పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.