గ్యాస్ ట్రేడింగ్ కు కొత్త ప్లాట్ ఫామ్ లాంఛ్ చేయనునున్న ధర్మేంద్ర ప్రధాన్

 గ్యాస్ ట్రేడింగ్ కు కొత్త ప్లాట్ ఫామ్ లాంఛ్ చేయనునున్న ధర్మేంద్ర ప్రధాన్

న్యూ ఢిల్లీ:  నేచురల్ గ్యాస్ ను ట్రేడ్  చేసుకోవ డానికి ఓ ట్రేడింగ్ ప్లాట్  ఫామ్ ను ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ప్లాట్ ఫామ్ ను  ఆయిల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్  సోమవారం లాంఛ్ చేయనున్నారు. డిమాండ్ –సప్లయ్ బట్టి లోకల్ మార్కెట్లో  నేచురల్ గ్యాస్ ధరలను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ మార్కెట్ ను  మరింత ప్రమోట్  చేయడానికి, మె రుగుపరచడానికి ఇండియన్ గ్యాస్ ఎక్చేంజ్ (ఐజీఎక్స్ ) ఉపయోగపడనుంది. కాగా ఇది మొదటి నేషనల్ లెవెల్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ కావడం విశేషం. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా బయ్యర్లు, సెల్లర్లు నిర్దిష్టమైన ఫిజికల్ హబ్స్ వద్ద స్పాట్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ లను ట్రేడ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఐజీ ఎక్స్ లో ట్రేడయ్యే కాంట్రాక్ట్ లకు కచ్చితంగా ఫిజికల్ డెలివరీ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్లను ట్రాన్స్ ఫర్  చేసుకోవడానికి వీలు కుదరదు. మొదటగా గుజరాత్ లోని హజిరా, దహేజ్ , ఆంధ్రాలోని ఓడూరు లేదా కాకినాడ ఫిజికల్ హబ్ ల వద్ద ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొత్త హబ్ లను ఈ ప్లాట్ ఫామ్ కిందకు తీసుకొస్తారు.