రెండేండ్ల తర్వాత పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దలైలామా

రెండేండ్ల తర్వాత పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దలైలామా

ధర్మశాల: తాను ఆరోగ్యంగా, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేంత బలంగా ఉన్నానని దలైలామా చెప్పారు. దాదాపు రెండేండ్ల తర్వాత ఆయన శుక్రవారం బయటికి వచ్చారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఆయన పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాలేదు. టిబెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సుగ్లఖాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన బోధనలు చేశా రు. ‘‘రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్ చెకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నందున వెళ్లలేదు. ప్రస్తుతం డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేంత బలంగా ఉన్నా’’ అని చెప్పారు. సుగ్లఖాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్ర మానికి సన్యాసులు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిబెటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్(సీటీఏ) మెంబర్లు సహా వేలాది మంది టిబెటన్లు హాజరయ్యారు. దలై లామా ఆరోగ్యంగా క్షేమంగా ఉండ డం ఆనందంగా ఉందని, దాదాపు రెండేండ్ల తర్వాత ఆయనను చూశామని సీటీఏ మెంబర్లు పేర్కొన్నారు.