ధన్వాడ సింగిల్ విండో బడ్జెట్ ఆమోదం

ధన్వాడ, వెలుగు: ధన్వాడ సింగిల్ విండో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహాజన సభలో 2024- –25 ఏడాదికి గాను రూ. 8. 16 కోట్ల అంచనా బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.  విండో చైర్మన్ వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ. మూడు కోట్లు ఎస్టీ  రూ. రెండు కోట్ల ఎల్ టీ రుణాలు రైతులకు అందజేయాలని నిర్ణయించారు. అర్ధంతరంగా నిలిచిన వ్యాపార రుణాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి రూ. కోటి  కేటాయించారు.

 విండో ద్వారానే ఎరువులు దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 15 లక్షలు మంజూరు చేశారు. వెంకటరామరెడ్డి మాట్లాడుతూ.. కంది కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  వైస్ చైర్మన్ గండి బాలరాజ్, నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు  లక్ష్మయ్య గౌడ్, రామచంద్రయ్య, రాగ్యా నాయక్, విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.