ధనుర్మాసం విశిష్టత : నాలుగ‌వ‌ రోజు పాశురము.. నారాయ‌ణ ..లోక‌మంతా ప‌చ్చ‌గా ఉండేలా వ‌ర్షం ప‌డాలి.. !

విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ఇవ్వాళ నాలుగో రోజు చదువుకోవాల్సిన పాశురం..

నాలుగో రోజు పాశురం

ఆళి మళైక్కణ్ణా: ఒన్రు నీ కైకర వేల్
 ఆళి యుళ్ పుక్కు మగన్దు కొడార్ త్తేఱి 
ఊళి ముదల్వనరువమ్ పోల్ -మెయ్ కఱుత్తు 
పాళి యన్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
 ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ర‌ దిర్ న్దు 
తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్ 
వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్ 
మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావము: ఓ వాన దేవుడా! వర్షం కురిపించడం లో లోభత్వము చూపించకు. సముద్రంలోని నీటినంతటినీ కడుపు నిండా తాగు. ఆ తర్వాత ఆకాశానికి ఎగిసి, ఈ సృష్టికి కారణభూతుడైన శ్రీమన్నారాయణుడి శరీరపు రంగైన నలుపు రంగులోకి మారిపో. స్వామి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రంలా మెరిసిపో. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖంలా గంభీరంగా గర్జించు. స్వామి ధనుస్సు నుంచి బయటికొచ్చే అవిరళ శరాలుగా వర్షధారలను కురిపించు. లోకమంతా పచ్చగా ఉండేలా వర్షాన్ని కురిపించు. మేమందరం ఆ వర్షధారలో తడిసి ఆనందిస్తాము. మా వ్రతానికి ఏ ఆటంకమూ కల గకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే వర్షాన్ని కురిపించు స్వామీ!

-వెలుగు,లైఫ్‌-