విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ఇవ్వాళ ( Decmber 20) ఐదో రోజు చదువుకోవాల్సిన పాశురం..
ఐదో రోజు పాశురం
మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్
తూవిత్తొళుతు
వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క
ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిననవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్.
భావం: ఆశ్చర్యకర గుణములు ఉన్నవాడు, తనకు మాత్రమే సాటి అనిపించే చేష్టలు కలవాడు శ్రీకృష్ణుడు. ఉత్తర మధుర ప్రాంతంలో, యమునా నదీ తీరమున, యాదవ కుటుంబంలో పుట్టాడు కృష్ణుడు. తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదరుడు కృష్ణుడు. ఈ వ్రతము చేస్తూ శీకృష్ణుడిని చేరడమే మన గమ్యం. స్వార్థంతో మన సొంతానికి కోరికలేవీ కోరుకోకుండా, పవిత్రమైన మనస్సుతో స్వామికి నమస్కరించి, అతని గుణములను భక్తితో కీర్తించి, ఆశీస్సులు పొందితే అన్ని పాపాలను కడిగేసుకోవచ్చు. స్వామిని కీర్తించుకుంటే మన పాపాలన్నీ అగ్నిలో పడ్డ దూదిలాగా భస్మమైపో తాయి.
ALSO READ : ఆధ్యాత్మికం: ముక్తికి మార్గం ధనుర్మాసం... విష్ణుమూర్తిని పూజిస్తే.. కష్టాలే ఉండవట..
-వెలుగు,లైఫ్-