అమ్మాపూర్​ గ్రామంలో కురుమూర్తి జాతరకు పోటెత్తిన భక్తులు

చిన్నచింతకుంట, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

దీంతో జాతర మైదానం భక్తులతో నిండిపోయింది. కురుమూర్తి వేంకటేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కురుమర్తి జాతర స్పెషల్​ అయిన సీకులు(మటన్​ కబాబ్స్)ను ఆస్వాదించారు.    -