ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల భవాని మాత ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీర పాయల్లో స్నానాలు చేసిన దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. భక్తులు ఎక్కువ ఉండడంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పట్టింది.

అనంతరం దుర్గమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్​గౌడ్​ బందోబస్తు నిర్వహించారు