పాలమూరు జిల్లాలో న్యూ ఇయర్​ సందడి

నెట్​వర్క్ వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు సందడి చేశారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు కిటకిటలాడాయి. కొత్త సంవత్సరానికి  వెల్​కమ్ పలుకుతూ ఆలయాలను దర్శించుకున్నారు. అలంపూర్​ జోగులాంబ, చిన్నచింతకుంట కురుమూర్తి, మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, నల్లమలలోని ఉమామహేశ్వర ఆలయం, కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మ ఆలయం, తలకొండపల్లి మండలం లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. 

ఇక పాలమూరులోని మయూరి పార్క్, పిల్లలమర్రిలో పర్యాటకులు సందడి చేశారు. బోటింగ్, జిప్  సైకిల్ రైడింగ్​, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. పిల్లలమర్రిలో కుటుంబసభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు .