కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం చేసి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. 

 మరికొంత మంది మల్లన్న నిత్య కల్యాణంలో పాల్గొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం మల్లన్న కొండపై కొలువైన ఎల్లమ్మ, నల్లపోచమ్మలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయంలో లిఫ్ట్​పనిచేయకపోవడంతో దివ్యాంగులు స్వామివారి దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.