అలంపూర్​కు పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శనివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము  నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

సీఎస్​ ప్రత్యేక పూజలుజోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సీఎస్​ శాంతికుమారి దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలికారు.