వేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

 

  • కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అదివారం భక్తుల రద్దీ నెలకొంది.  సెలవురోజు , కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ర్టం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాజన్న సన్నిధికి వచ్చారు.

 కోడెల క్యూలైన్​, దర్మదర్శనం క్యూలైన్​ మీదుగా ఆలయంలో ప్రవేశించి ఆలయంలో స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం  ఆలయ ముందుబాగంలో రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.