తిరుమలలో ఆందోళనకు దిగిన భక్తులు

తిరుమలలో ఆందోళనకు దిగిన భక్తులు
తిరుమలలో ఆందోళనకు దిగారు భక్తులు. ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ నిరసన తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 11 వేల రూపాయలు పెట్టి టికెట్టు కొన్నా…. తమకు సరిగ్గా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగించలేదని మండిపడ్డారు.  బంగారు వాకిలి  నుంచే వెనక్కి పంపేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ గర్భ గుడిలో తమను నెట్టివేయడంపై టిటిడి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన భక్తులు.. కనీసం మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా సెక్యూరిటీ సిబ్బంది తోసివేశారని ఆరోపించారు.