జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. ఏకాదశి కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. భక్తులు తరలిరావడంతో అలంపూర్  ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న కర్నూల్​ కలెక్టర్

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఏపీలోని కర్నూల్​ కలెక్టర్  సృజన గుమ్మల దర్శించుకున్నారు. ఆలయాలకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు, ఈవో పురేందర్ కుమార్  స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.