కిటకిటలాడిన జోగులాంబ ఆలయం

అలంపూర్, వెలుగు: అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు ఏపీ, కర్నాటక రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కర్నాటక నుంచి కాలినడకన శ్రీశైలం వెళ్తున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.