జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమావాస్య, సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

 భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు, నిర్మల్  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.