తుంగభద్రా నదికి దశవిధ హారతి

అలంపూర్,వెలుగు : కార్తీక సోమవారం సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అర్చకులు సాయంత్రం తుంగభద్రా నదికి దశవిధ హారతులిచ్చారు.