జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

  •     ట్రాఫిక్ జామ్ తో ఇక్కట్లు

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు జములమ్మ దర్శనానికి వచ్చి పూజలు చేస్తుంటారు.  ఏరువాక పౌర్ణమి వరకు భక్తుల తాకిడి ఉంటుందని ఈవో సురేందర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గద్వాల, ఎర్రవల్లి చౌరస్తా రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ఎవరు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.