కురుమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అమ్మాపూర్  శివారులో వెలిసిన కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం అమావాస్య కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
- చిన్నచింతకుంట, వెలుగు