జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

  •     ఉగాది సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్ కు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ  ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది.

సుంకులమ్మ ఆలయానికి..

ఉండవెల్లి, అలంపూర్  మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొలువదీరిన సుంకులమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. భక్తులు కోడిపుంజులతో ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకుంటారు.