జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.