జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

ముందుగా గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు