దేవిశ్రీ ఓపిక నశించిందా: రాంగ్ టైమింగ్ సర్.. నేనేం చేయగలను ఇలా అడిగేయాలి అంతే!

'మనకి రావాల్సింది కచ్చితంగా అడిగి తీసుకోవాలి అది డబ్బు అయిన, క్రెడిట్ అయిన'..ఈ మాటలు అన్నది పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. పుష్ప 2 నిర్మాత యలమంచిలి రవిని ఉద్దేశించి దేవి శ్రీ మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆయన మాటల్లోనే .. 'స్టేజ్ ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడలేదు..  టైంకి పాట ఇవ్వలేదు. టైమ్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైమ్ కి ప్రోగ్రామ్ రాలేదు అని ఎక్కువ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి..

ALSO READ : Pushpa2: పుష్ప గాడి తెలుగు వైల్డ్ ఫైర్ ఈవెంట్‌కి రంగం సిద్ధం.. ఎప్పుడు.. ఎక్కడంటే?

అదేంటో అర్ధం కాదు.. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20-25 నిమిషాలు అవుతుంది.. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను ఆపారు. నాకు అసలే సిగ్గు.. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిగ్గు లేకుండా ఉంటాను, స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ సిగ్గుపడేది నేనే. నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్న. వాళ్ళు నన్ను వదలడం లేదు. కిస్సిక్ సాంగ్ లాంచ్ అవుతుండగా వచ్చాను. మీరొచ్చి నాతో రాంగ్ టైమింగ్ సర్ అని అంటున్నారు. నేనేం చేయగలను సర్. ఇవన్నీ సపరేట్గా కలిసినపుడు అడిగితే పెద్ద కిక్ ఉండదు.. ఇలా అడిగేయాలి' అంటూ దేవిశ్రీ స్టేజ్ పైన మాట్లాడిన మాటలు ఇపుడు హాట్ టాపిక్ మారాయి. 

అయితే.. దేవిశ్రీ అలా మాట్లాడానికి కారణం లేకపోలేదని తెలుస్తోంది. . ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుండటంతో ఇంకా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ కాలేదని టాక్. అందుకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం డైరెక్టర్ సుక్కు, అల్లు అర్జున్, మైత్రి నిర్మాతలు కలిసి దేవిశ్రీ తో పాటు తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ను తీసుకున్నారట. దాంతో దేవిశ్రీ ప్రసాద్ మేకర్స్ మీద అసంతృప్తిగా ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మరి ఈ విషయంపై ఎవరెలాంటి వివరణ ఇవ్వనున్నారో చూడాలి.