మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రుల పోర్ట్ ఫోలియోను శనివారం (డిసెంబర్ 21) ప్రకటించింది. సీఎం దేవండ్ర ఫడ్నవీస్ కు హోంశాఖ, ఎన్ సీపీ నేత అజిత్ పవార్ కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు లను కేటాయించింది. ఇక మరో ముఖ్యనేత ఏక్ నాథ్ షిండేకు అర్బన్ డెవలప్ మెంట్ శాఖను కేటాయించారు.
హోంశాఖను ఆశించిన మాజీ సీఎం, శివసేన నేత ఏక్ నాథ్ షిండేకు పట్టణభివృద్ది, గృహనిర్మాణం, పబ్లిక్ వర్క్స్ శాఖలనుకేటాయించారు. ఎనర్జీ, లాండ్ జ్యుడిషి యరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్, పబ్లిసిటీ వంటి పోర్ట్ ఫోలియోలను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం దేవేంద్ర పడ్నవీస్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఆర్థిక శాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా కేటాయించారు.
డిసెంబర్ 5న సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 15న అసెంబ్లీ వింటర్ సెషన్స్ కు ముందు 39 మంది మంత్రులుగా చేర్చుకున్నారు. తాజాగా వారికి పోర్ట్ ఫోలియను కేటాయించారు.