అయ్యో పాపం.. వేలంలో భారత క్రికెటర్ పడిక్కల్‎కు భారీ షాక్

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంటే.. మరి కొందరు ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలోనే టీమిండియా యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్‎కు మెగా వేలంలో బిగ్ షాక్ తగిలింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‎తో ఆక్షన్‎లోకి వచ్చిన పడిక్కల్‎ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజ్ ఆసక్తి చూపించలేదు. దీంతో పడిక్కల్ అన్ సోల్డ్ ప్లేయర్‎గా మిగిలిపోయాడు.

టాలెంటెడ్ ప్లేయర్‎గా గుర్తింపు తెచ్చుకున్న పడిక్కల్‎ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆర్సీబీ జట్టు ద్వారా దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడాడు. అంచనాల మేరకు రాణించకపోవడంతో దేవదత్ పడిక్కల్ ను ఆర్ఆర్ రిటెన్ చేసుకుకోకుండా వదిలేసింది. 

దీంతో మెగా వేలానికి వచ్చిన పడిక్కల్‎ను ఏ ప్రాంఛైజ్ కొనుగోలు చేయకపోవడంతో మనోడికి తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి టీమిండియాకు పడిక్కల్ ఎంపికయ్యాడు. భారత జట్టుకు ఎంపికైనప్పటికీ పడిక్కల్‎ను కొనేందుకు ఫ్రాంచైజ్ లు ముందుకు రాకపోవడం గమనార్హం.