మత్స్యకారులకు చేప పిల్లలు అందజేత

కొత్తకోట, వెలుగు : ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి శుక్రవారం మృత్స్యకారులతో కలిసి శంకర సముద్రంలో విడిచి పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మృత్య్సకారులు అడగకపోయినా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మృత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

2.40 లక్షల చేప పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేసి శంకర సముద్రంలో వదలడం ఆనందంగా ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందని చెప్పారు. మార్కెట్​ చైర్మెన్​ పల్లెపాగ ప్రశాంత్, వేముల శ్రీనివాస్ రెడ్డి, బీచుపల్లి యాదవ్, శ్రీను, రావుల సురేంద్రనాథ్​రెడ్డి, రావుల జితేందర్​ రెడ్డి, చీర్ల రాము, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.