ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సరికాదు

  • దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హీరో అల్లు అర్జున్ తప్పును సరిదిద్దుకోకుండా, సమర్థించుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్ తెలిపారు. తప్పు జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

ఆదివారం సీఎల్పీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. సంధ్య ధియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి చనిపోయిందని, ఆమె కొడుకు శ్రీతేజ్ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసేందుకు వచ్చిన హీరో  రోడ్ షో చేయడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తోక్కిసలాటలో  రేవతి చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆమె కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కోర్టులో పరిధిలో కేసు ఉన్నప్పుడు, ప్రెస్ మీట్ పెట్టొద్దని అడ్వైజర్లు చెప్పలేదా..? అని నిలదీశారు.