Devara Twitter X Review: దేవర ట్విట్టర్ X రివ్యూ.. ప్రీమియ‌ర్స్‌కు పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక దేవర ఆగమనం వచ్చేసింది. ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 27న ) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో గ్రాండ్ గా రీలిజ్ అయింది. 

అత్యంత భారీ బడ్జెట్ తో రిలీజైన దేవరతో ఎన్టీఆర్ హిట్ కొట్టాడా..? ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల ఎలాంటి కథతో ఆడియన్స్ ముందుకొచ్చాడు..? రాజమౌళితో చేసిన హీరోల ఫెయిల్యూర్స్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేశాడా? అనే విషయాలు ట్విట్టర్ X రివ్యూలో తెలుసుకుందాం. 

దేవ‌ర‌గా ఎన్టీఆర్‌, భైర‌గా సైఫ్ అలీఖాన్ పాత్ర‌లు పోటాపోటీగా సాగుతాయ‌ని చెబుతున్నారు.ఎర్ర స‌ముద్రం తీర ప్రాంతంలో భారీ కంటైన‌ర్ షిప్‌ల‌పై వ‌చ్చే ఖ‌రీదైన సామాగ్రిని దొంగ‌త‌నం చేసే నాలుగు ఊళ్ల ప్ర‌జ‌ల జీవితాల నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంద‌ని అంటున్నారు. స్టోరీ సింపుల్‌గానే ఉన్నా త‌న స్క్రీన్‌ప్లేతో కొర‌టాల శివ మ్యాజిక్ చేశాడ‌ని అంటున్నారు.

దేవర ప్రీమియర్, బెనిఫిట్ షో చూసిన వారి టాక్ ప్రకారం.. దేవరలో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయిందట. టైటిల్ కార్డ్, ఎంట్రీ సీన్స్‌ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ గూస్ బంప్స్ తెప్పింస్తుందట. అది ఓ అద్భుతమని అంటున్నారు ఫ్యాన్స్.

ఇకపోతే సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాస్తున్న పాటలు చూడటానికి చాలా బాగున్నాయట. జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందట. అండర్ వాటర్ సీక్వెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వెల్ బ్లాక్.. ఫస్ట్ హాఫ్ కి హైలెట్ అంటున్నారు. ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ రెండు రోల్స్‌ని చించేస్తూ.. మరోసారి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడంట.

ఇక వరల్డ్ వైడ్ గా దేవ‌ర ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. ఎన్టీఆర్ వ‌న్ మెన్ షో ఇద‌ని చెబుతున్నారు. టైటిల్ కార్డ్ నుంచి చివ‌రి వ‌ర‌కు ఎన్టీఆర్ అద‌ర‌గొట్టేశాడ‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డ్యూయ‌ల్ రోల్ ట్విస్ట్ బాగుంద‌ని, దేవ‌ర‌, వ‌ర పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడ‌ని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకు అనిరుధ్ మ‌రో హీరోగా నిలిచాడ‌ని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అత‌డి బీజీఎమ్ థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తోంద‌ని చెబుతోన్నారు. 

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారికి ఫుల్ మీల్స్ పెట్టిదంట. రెండు ఫైట్లు చాలా అద్భుతంగా వచ్చాయని.. అవి దేవర సినిమాను మరో మెట్టు ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్లాయని ట్వీట్స్ చేస్తున్నారు. వాటికి సినిమాటోగ్రఫీ రత్నవేలు, అనిరుధ్ మూజిక్ అదుర్స్ అని అంటున్నారు.

ఎన్టీఆర్.. దేవర, వరగా సినిమాలో కనిపించగా.. వర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కి మంచి హైప్ ఉంటుందట. మాస్ ఎలివేష‌న్లు, ఎన్టీఆర్ చెప్పిన‌ట్టుగానే చివ‌రి 40 నిమిషాలు ప్రేక్షకులని సీట్లో కూర్చోకుండా చేశార‌ని అంటున్నారు.

బాహుబ‌లి స్ఫూర్తితో... స్టోరీ ప్రెడిక్ట‌బుల్‌గా ఉండ‌టం, సెకండాఫ్‌లో చాలా సీన్లు ల్యాగ్ కావ‌డం కూడా కొంత సినిమాకు మైన‌స్‌గా మారింద‌ని చెబుతున్నారు. బాహుబ‌లి వ‌న్ స్ఫూర్తితో క్లైమాక్స్‌ను కొర‌టాల శివ రాసుకున్నాడ‌ని, పార్ట్ 2 కోసం లీడ్ ఇస్తూ సినిమాను ఎండ్ చేశార‌ని, కానీ ఆ ట్విస్ట్ అంత గొప్ప‌గా లేద‌ని ఫ్యాన్స్ చెబుతోన్నారు.

దేవర, వరగా ఎన్టీఆర్ ఎలివేష‌న్స్‌, హీరోయిజం దేవ‌ర మూవీలో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు. దేవ‌ర‌ విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, ప‌ర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాచ్ అని చెబుతున్నారు.

వర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి మంచి హై ఉంటుందట. సినిమాలో ఈ పాత్రని చాలా బాగా డిజైన్ చేశాడట కొరటాల. మొత్తంగా ఇది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని అంటున్నారు.

దేవర ఫస్ట్ హాఫ్ అద్భుతమని.. ఇంటర్వెల్ గూస్‌బంప్స్ అని.. ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ - సూపర్ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లిందని ఈ సినిమా చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా చెలరేగిపోతారని.. సెకండాఫ్ కోసం ఫుల్ వెయిటింగ్ అని అంటున్నారు!!

ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని.. థియేటర్‌లో షార్క్ సీన్ కిక్ ఇచ్చిందని.. దేవర 2 కోసం వేచి ఉండేలా డైరెక్టర్ కొరటాల సినిమా తెరకెక్కించాడని..ఇకపోతే డైరెక్టర్ మొత్తం మీద మంచి కథతో తిరిగొచ్చాడని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature