కాంగ్రెస్ లో చేరిన దేవర మల్లప్ప

మక్తల్, వెలుగు: బీఆర్ఎస్  లీడర్, తెలంగాణ ట్రేడ్  కార్పొరేషన్  మాజీ చైర్మన్  దేవర మల్లప్ప సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మక్తల్  పట్టణంలోని కాంగ్రెస్  ఆఫీస్​లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సమక్షంలో పార్టీలో చేరగా, ఆయనకు పార్టీ కండువా క‌‌ప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవరి మల్లప్ప మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్  పాలనలోనే అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్  పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు మండలంలోని గుడిగండ్ల గ్రామంలో బీరప్ప బండారు ఉత్సవంలో పాల్గొన్నారు. గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, గట్టు తిమ్మప్ప, శివకుమార్, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, బోయ రవికుమార్, అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.