బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్‌‌‌‌

న్యూఢిల్లీ : బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌గా దేవజిత్‌‌‌‌ సైకి యా, ప్రభతేజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.   సెక్రటరీ, ట్రెజరర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లకు గత వారం ఈ ఇద్దరు నామినేషన్స్‌‌‌‌ దాఖలు చేశారు. వీళ్లకు పోటీగా మరెవరూ నామినేషన్స్‌‌‌‌ వేయలేదు.

మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్స్‌‌‌‌ విత్‌‌‌‌ డ్రా సమయం కూడా ముగిసింది. దీంతో ఇద్దరి పేర్లతో కూడిన తుది జాబితాను బోర్డు ఎలక్టోరల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ప్రకటించారు.  ఈనెల 12న జరిగే ఎస్‌‌‌‌జీఎమ్‌‌‌‌లో వీళ్ల ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు.