వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..

గుంటూరులో వేంకటేశ్వరస్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఇద్దరు వ్యాపారస్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే... బృందావన్​ గార్డెన్స్​ లోని శ్రీ వెంకటేశం అపార్ట్​ మెంట్​ లో కలియగ దేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి.. కొంత కాలం పూజలు చేస్తున్నారు.  అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యాపారస్తులకు నష్టం వచ్చిందని.. వెంకన్న స్వామికి పూజించినా కరుణ చూపలేదని ... ఆ ఇద్దరు వ్యాపారులు స్వామి వారి విగ్రహాన్ని ద్వంసం చేశారు. ఈ ఘటనపై అపార్ట్​మెంట్​ కమిటి అధ్యక్ష .. కార్యదర్శులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.