మూడోసారి గెలిచినా కేసీఆర్ తీరు మారలే

  • మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికి దూరంగానే కేసీఆర్​
  • ఐదేండ్లుగా క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగే పెట్టని గులాబీ బాస్​
  • సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ప్రజలు

సిద్దిపేట, వెలుగు : గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిది నెలలు కావస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటివరకు ప్రజల్ని కలవకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ కేంద్రంలోని గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా ఆయన ఇక్కడకు రావడం లేదు. నియోజకవర్గ ప్రజలకు ఏదైనా పనుండి ఎర్రవల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినా అక్కడ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవనిచ్చే పరిస్థితి లేదు. అటు సీఎంగా ఉన్న టైంలోనూ, ఇప్పుడు మాజీ అయినంక కూడా ఆయన ప్రజలకు అందుబాటులోకి రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాలే పెట్టని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకర్గ కేంద్రంలో ఆరేండ్ల కింద ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. 2019లోనే ప్రారంభం అయిన ఈ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటివరకు కాలే పెట్టలేదు. నియోజకవర్గపరిధిలోని ఎర్రవల్లి నుంచే అధికారులు, పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ లీడర్లే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా పనులు నిర్వహిస్తుండేవారు. ప్రతి నెల క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటానని గత ఎన్నికలకు ముందు ప్రకటించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం మాజీగా మారడంతో ఆయన ఓఎస్డీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా పనిచేస్తుండగా, ముఖ్య నేతలంతా ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమెల్యేగా కేసీఆర్ గెలిచి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గ  ప్రజలను కలవకపోవడంపై బీజెపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడు సార్లు గెలిపించినా ఒక్కసారి కూడా ఇక్కడ కనిపించ లేదు.. ఎక్కడున్నాడో తెలియదు’ అంటూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోతో పోస్టర్లు తయారు చేయించి నియోజకవర్గంలో అతికించడమే కాకుండా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, వ్యవసాయంలో ఎకరాకు రూ. కోటి సంపాదించే వ్యక్తి.. గజ్వేల్ నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి రాలేదు.. ఆయన ఆచూకీ చెప్పండి’ అంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించడం లేదంటూ గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసి, వెతికి పెట్టాలని కోరారు.

ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్​ వద్ద ‘డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లబ్ధిదారుల నిరసన

గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్ల లబ్దిదారులు తమ సమస్యలు పరిష్కరించాలని రెండేళ్లుగా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్లు ఉన్నప్పటికీ తమకు ఇండ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోకపోవడంతో రెండు నెలల కింద ఎర్రవల్లిలోని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి తమ గోడు వినిపించుకునేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుటే ధర్నాకు దిగారు.