డేరా చీఫ్ గుర్మీత్‌కు పెరోల్‌

డేరా చీఫ్ గుర్మీత్‌కు పెరోల్‌

రోహ‌త‌క్‌ : అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్‌కు పెరోల్ మంజూరు చేశారు. రోహ‌త‌క్‌లోని సున‌రియా జైలులో ఉంటున్న గుర్మీత్ రామ్ రహీమ్ కు నెల రోజుల పెరోల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. 2017లో చోటుచేసుకున్న అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్‌కు జైలు శిక్ష ప‌డింది. నెల రోజుల పెరోల్‌పై అత‌ను జైలు నుంచి విడుద‌లైన‌ట్లు సీనియ‌ర్ పోలీసు అధికారి తెలిపారు.