నిమ్స్​లో మీడియా పాయింట్

పంజాగుట్ట, వెలుగు : నిమ్స్​లోని అన్ని విభాగాల సెక్యూరిటీ అధికారులతో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. లక్ష్మీభాస్కర్ ​ఆదివారం సమావేశమయ్యారు. రోగులు, సందర్శకుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నిమ్స్​లో సమాచార సేకరణ కోసం వచ్చే జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా పాయింట్​ను​ ఏర్పాటు చేశామన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి మీడియా నిర్వహణపై పలు సూచనలు చేశారు.

ఆయా సంస్థల ప్రతినిధుల ఐడీ కార్డులు చెక్​ చేసి అనుమతి ఇవ్వాలని సూచించారు. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్​ మెడికల్ సూపరింటెండెంట్స్​ డాక్టర్​ రాకేశ్ నరిమేటి, డాక్టర్ చరణ్​ రాజ్​మేడే పాల్గొన్నారు.