ఏపీ డిప్యూటీ సీఎం చేసిన టిక్ టాక్ వీడియో వివాదాస్పదంగా మారింది. టిక్ టాక్ యూత్ దగ్గర నుంచి పొలిటీకల్ లీడర్ల దాకా తెగ అట్రాక్ట్ చేస్తోంది.
ఏపీ సీఎం నాటి ప్రతిపక్షనేత జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగర్ మంగ్లీతో “రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న” అంటూ ఓ పాటపాడించారు. ఆ పాట రాయలసీమ వాసుల్ని విపరీతంగా ఆ కట్టుకుంది. తాజాగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే , డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అయితే ఈ వీడియో అమరావతి రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిని తరలిచొద్దంటూ 15రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం తాము అందోళన చేస్తుంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న శ్రీవాణి టిక్ టాక్ వీడియోలు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు.
