నేను మెతక కాదు.. తొక్కి నారతీస్తా.. జగన్ కు పవన్ మాస్ వార్నింగ్..

వైసీపీ అధినేత జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లాలో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీని ప్రారంభించిన పవన్.. బహిరంగ సభలో మాట్లాడుతూ వైఎస్ జగన్ సహా వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు కొనసాగుతున్నాయని అన్నారు.

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు..  ఇంత దారుణంగా ఓడినా కూడా వైసీపీ నేతల నోరు ఆగట్లేదని మండిపడ్డారు పవన్. మీ నోటి వెంట మరేమీ రాకుండా మీ భవిష్యత్ ను చేస్తానని  వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడితే మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. తొక్కి నార తీస్తా... చూస్తూ ఉరుకోనంటూ గట్టిగా హెచ్చరించారు పవన్.

వెల్ఫేర్ హాస్టల్స్ లో బాత్ రూమ్ లు సక్రమంగా లేవు, వసతులు లేవంటూ ఆడపిల్లలకు సమస్యలు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ ఫోటోలు, టెక్నాలజీతో వేధిస్తే సహించబోమన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ సోషల్ మీడియా ప్రతీ ఫ్లాట్ ఫాం మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతల చర్యలపై బలమైన యాక్షన్ తీసుకుంటామని..  ఆ తర్వాత రోడ్లపైకి వస్తె కాళ్ళు, కీళ్ళు ఇరక్కొడతామంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.