ఐఏఎస్ ఐపీఎస్ లను జగన్ సర్కార్ బొమ్మల్లా చేసింది... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఐదేళ్ళలో పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని,ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసిందని అన్నారు.

ప్రజలు కూటమికి అద్భుతమైన విజయం అందించారని, ఎన్నో అవమానాలను.. ఆంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డామని అన్నారు పవన్ కళ్యాణ్.