అచ్చంపేట లిఫ్ట్  ఇరిగేషన్  స్కీం త్వరలోనే ప్రారంభిస్తాం

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

అచ్చంపేట, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి సాగు నీటిని అందించే అచ్చంపేట లిఫ్ట్  ఇరిగేషన్ స్కీమ్​ను త్వరలోనే ప్రారంభిస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అచ్చంపేట మండలం అన్నవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్  పనులను పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎంకు అచ్చంపేట ప్రాంత సమస్యలను ఎమ్మెల్యే వంశీకృష్ణ వివరించారు.

స్పందించిన డిప్యూటీ సీఎం డిండి బ్యాలెన్సింగ్  రిజర్వాయర్  నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న అన్ని గ్రామాలకు ఆర్అండ్ఆర్  ప్యాకేజీని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట, దేవరకొండ రహదారిపై హై లెవెల్  బ్రిడ్జి నిర్మించాలని, డిస్ట్రిబ్యూటరీ-1, డిండి బాలెన్సింగ్  రిజర్వాయర్  ద్వారా అక్కారం, ఘనపురం, మన్నెవారిపల్లి గ్రామాలతో పాటు 15 తండాలకు సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ వైభవ్  గైక్వాడ్  రఘునాథ్  పాల్గొన్నారు.