ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య డెయిరీ క్లస్టర్స్

హైదరాబాద్: ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య డెయిరీ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మాదాపూర్ హైటెక్స్‌ ప్రాంగణంలో జరిగిన 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్​లో  ఆయన మాట్లాడుతూ ‘పాడి పరిశ్రమకి కాంగ్రెస్​సర్కార్ పెద్దపీట వేస్తుంది. బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించాం. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తం.  డెయిరీ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం చేస్తం’ అని భట్టి తెలిపారు.