అక్రమ నిర్మాణాల కూల్చివేత

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఏనుగొండ అక్షర కాలనీ బైపాస్  రోడ్  సమీపంలో సర్వే నెంబర్ 25లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఆదివారం డీటీ దేవేందర్, ఆర్ఐ నర్సింగ్, సుదర్శన్ రెడ్డి కూల్చివేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.